Flax seeds in telugu అవిసె గింజలు ఐదు సంవత్సరాల క్రితం నుండి వెలుగులోకి వచ్చిన  మంచి పోషకాలను కలిగిన పీచు పదార్ధాలు కలిగి ఉన్న ఒక మంచి విత్తనాలు ఇవి చూడ్డానికి  నువ్వుల కన్నా కొంచెం పొడవుగా ఉంటాయి.ఈ అవిసగింజల లో పీచు పదార్థాలు ,   మంగని విటమిన్   బి మరియు ఫ్యాటీ యాసిడ్ ఆల్ఫా లినోలిక్  ఆసిడ్ లేదా ఒమెగా త్రీ లాంటి ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది చాలా పురాతనమైన పీచు పదార్థాలు కలిగిన పంట ఇది ఎక్కువగా ఈజిప్టు మరియు చైనా దేశాలలో పంటలు పండించేవారు. అయితే ఎందుకు ఈ అవిస గింజలు తినాలి అంటే ఇందులో ఒమెగా-3 మరియు  ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వలన మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా మరియు  వైరస్ ల బారిన పడకుండా రక్షిస్తాయి.

మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. ఈ అవిస గింజలు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంద.ఇది రోజు మన భోజనంలో తీసుకోవడం వలన  హృదయనాళ సంబంధమైన సమస్యలతో బాధపడే వారు ఎక్కువ ప్రమాదంలో పడకుండా రక్షిస్తాయి.

ఎవరైతే  డయాబెటిక్ మరియు షుగర్ వ్యాధులు  ఉంటాయో వారికి నియంత్రించబడుతుంది. అవిస గింజలు మలబద్దకం రాకుండా నివారిస్తుంది. అవిస గింజల నూనె తీసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గిస్తుంది.

Flax seeds / అవిసె గింజలు రోజులో ఎంత తీసుకోవాలి?? రుచి ఎలా ఉంటుంది??

ఆరోగ్యం బాగుండాలి అంటే అవిసె గింజలను రోజులో ఒక స్పూను లేదా రెండు స్పూన్లు 16 గ్రామ్స్ గింజలు లేదా పిండిలా చేసుకుని  తీసుకోవాలి. కొత్తగా వాడుతున్నవారు అయితే మొదట్లో ఒక టేబుల్ స్పూన్ తో మొదలు పెట్టండి శాకాహారులైతే రోజులో రెండు స్పూన్లు తీసుకోవచ్చు .మీరు మాంసాహారులైతే చేపలు తినే వారు అయితే రోజులో  ఒక్క స్పూన్ సరిపోతుంది. ఇది  గింజ లాగా ఉండి  వాసవి కానీ రుచి కానీ లేకుండా ఉంటుంది.

Flax seeds / అవిసె గింజలు ఉపయోగించడం ఎలా?

అవిసె గింజలు చూడడానికి చిన్నగా ఉంటాయి. బయట గట్టిగా ఉంటాయి. ఇవి నమిలి తినే గలిగేలా ఉంటాయి. అవిసె గింజలను గ్రైండర్లో వేసి   పిండిలాగా చేయడం వలన  పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా పిండి లాగా చేసి  రోజు  మనము  రోజు చేసుకునే వంటలలో ఉపయోగించవచ్చు.

భారతీయ ఆహారంలో flax seeds/అవిసె గింజలను ఎలావాడుకోవచ్చు????

1) ఒక టీస్పూన్   అవిసె గింజల పొడిని తీసుకుని గోధుమ పిండి లో కలిపి చపాతీ లాగా చేసి తినవచ్చు. దోశ పిండి లో మరియు ఇడ్లీ పిండి కలిపి కూడా తీసుకోవచ్చు వండిన అన్నం మరియు కులాల్డా మరియు ఇడ్లీ లో కూడా కలుపుకోవచ్చు.  వండిన అన్నం మరియు పులావ్ లో కూడా   అవిసె గింజల పొడిని కూడా వాడవచ్చు.

2)  మజ్జిగ ,జ్యూస్, ఎస్సీ,  పాలు ఇలాంటివి తాగేటప్పుడు కూడా అవిసె గింజల పొడిని కలుపుకోవచ్చు.

3) ఉదయాన్నే శాండ్విచ్లు ,పరాటాలు ,  పాన్ కేక్స్   తినేవారు దానిపైన ఒక స్కూలు ఈ పొడిని వాడవచ్చు. 4)   చట్నీస్ ,  సలాడ్,   టిక్కీ లో కూడా ఈ పొడిని వేసుకుని వాడవచ్చు.

చిట్కాలు?

1) ఇవి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగ పడతాయి కాబట్టి అవిసె గింజలు తీసుకొని పొడి చేసుకుని ఒక  గాజు డబ్బాలో మూతపెట్టి ఉంచండి ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

2) మీరు కొత్తగా తినే వారైతే మొదట్లో ఒక స్పూన్ తో లేదా సగం స్పూన్ తో మొదలు పెట్టండి.ఎందుకంటే ఎలర్జిక్ ఉన్న వారు ఉంటారు కాబట్టి నెమ్మదిగా కొద్ది మొత్తంలో తీసుకోండి. పిల్లలు మరియు గర్భిణీలు ఫిజిషియన్  సలహా తీసుకోవడం మంచిది.

3)  అవిస గింజలు /flax seeds తీసుకుని రోజు అంతా చాలా నీళ్లు తాగే లాగా చూసుకోండి, ఎందుకంటే ఇవి ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన విత్తనాలు

4) అవిస గింజలు/flax seeds నీటిని 10 నుంచి 14 రెట్టింపు బరువును కలిగి ఉంటాయి. ఎందుకంటే అధిక పీచు పదార్ధాన్ని కలిగి ఉండడం వలన

5) మీకు ఒకవేళ దీని రుచి నచ్చకపోతే pan మీద  అవిసె గింజలను వేయించి తినండి.